BalaKrishna | వార్తలు నిజమేనా?
నిర్ణయాలు వేగవంతంగా తీసుకోవడంలో మాస్టర్ నందమూరి బాలకృష్ణ. కథ నచ్చితే దర్శకుడికి అనుభవం లేకపోయినా అవకాశాలిచ్చేస్తారాయన. దానికి చాలా ఉదాహరణలున్నాయి.
నిర్ణయాలు వేగవంతంగా తీసుకోవడంలో మాస్టర్ నందమూరి బాలకృష్ణ. కథ నచ్చితే దర్శకుడికి అనుభవం లేకపోయినా అవకాశాలిచ్చేస్తారాయన. దానికి చాలా ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య వార్తలకున్నంత డిమాండ్ ఎవరికీ లేదు. ఆయన విజయాలే దానికి కారణం కావొచ్చు. రేటింగులకోసం ఏదో ఒక బాలయ్య వార్తని వండి వార్చేయడం నెటిజన్స్‌కి పరిపాటైపోయింది. రీసెంట్గా బాలయ్యకు సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ‘శ్యామ్‌సింగరాయ్’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కథను బాలయ్య ఓకే చేశారనేది అందులో తొలి వార్త.
బాలయ్యకోసం ‘శ్యామ్ సింగరాయ్’ తరహాలో పీరియాడిక్ నేపథ్యంతో రాహుల్ కథను తయారు చేశాడని, ఆ కథ బాలయ్యకు కూడా బాగా నచ్చడంతో ఆయన ప్రొసీడ్ అన్నారని, ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమా పూర్తవ్వగానే బాలయ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారనేది ఆ వార్త సారాంశం. ఇక రెండో వార్త విషయానికొస్తే.. మోహన్‌బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’లో బాలయ్య కూడా భాగం కానున్నారట. ఇందులో ఇప్పటికే మోహన్‌లాల్, ప్రభాస్, శివరాజ్‌కుమార్ నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు వీరితోపాటు బాలయ్య కూడా నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కథ రీత్యా ఇందులో శివుడు మారువేషంలో వచ్చి కన్నప్పని పరీక్షిస్తాడని సమాచారం. ఆ మారువేషంలో వచ్చే శివుడిగా బాలయ్య కనిపించనున్నారని తెలుస్తున్నది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

