NBK109 Movie | దసరాను టార్గెట్ చేసిన బాలయ్య.. ఈ సారి వర్కవుట్ అవుతుందా?
ఇప్పుడున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణదే హవా నడుస్తుంది. అఖండ వంటి భారీ విజయం తర్వాత వీరసింహా రెడ్డితో మరో విజయం సాధించాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్ల వరద పారింది. ప్రస్తుతం బాలయ్య హ్యట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు.
NBK109 Movie | ఇప్పుడున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణదే హవా నడుస్తుంది. అఖండ వంటి భారీ విజయం తర్వాత వీరసింహా రెడ్డితో మరో విజయం సాధించాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్ల వరద పారింది. ప్రస్తుతం బాలయ్య హ్యట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టనుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాను దసరాకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. వీరసింహా రెడ్డి మాదిరిలానే పండగను టార్కెట్ చేసి హిట్టు కొట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. ఆ దిశగానే షూటింగ్‌ను కూడా వేగవంతం చేయనున్నారట. ఈ సినిమాలో బాలయ్య 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ‘పెళ్లిసందD’ ఫేం శ్రీలీల బాలయ్య కూతురుగా నటించనుంది. ఈ సినిమా మొత్తం ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో సాగుతుందని అనీల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక బాలకృష్ణకు జోడీగా కాజల్ నటించనుందని టాక్. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

