NBK108 | బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాకు మూహూర్తం ఫిక్స్..!
కెరీర్ బిగెనింగ్ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్లు కొడుతున్న అనీల్ రావిపూడి, మొదటి సారిగా యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది కూడా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో.
NBK108 Movie | ఆరుపదుల వయసులోనూ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాళ్ విసురుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఎంతో కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణ.. గతేడాది ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అదే జోష్‌లో ‘వీరసింహా రెడ్డి’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.
ఈ సినిమా తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓ బిగ్ అప్డేట్ ప్రకటించింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను గురువారం జరుపనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య 45ఏళ్ళ వయసున్న తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలీలా బాలయ్యకు కూతురుగా నటిస్తుంది.
షైన్ స్క్రీన్ సంస్థ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.కెరీర్ బిగెనింగ్ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి, మొదటి సారిగా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

