Karthi | ఒకేసారి కార్తీ మూడు సినిమాల అప్డేట్స్.. ఫ్యాన్స్‌లో జోష్
Karthi | కార్తీ (Karthi) ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న జపాన్ (Japan) షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటే కార్తీ 26 మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. కార్తీ 26 (Karthi 26) ఇటీవలే షురూ అవగా.. ఈ ఏడాది చివరి కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది.
Karthi | కార్తీ (Karthi) ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న జపాన్ (Japan) షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా ఈ సినిమాతోపాటే కార్తీ 26 మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. ఇవాళ ఉదయం చెన్నైలో జపాన్ ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. కార్తీ 26 (Karthi 26) ఇటీవలే షురూ అవగా.. ఈ ఏడాది చివరి కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. మరోవైపు కార్తీ 27 (Karthi 27) ఎక్జయిటింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఇంతకీ అతడు పోషించే పాత్ర ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. కార్తీ 26వ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివరలో కార్తీ 27 మొదలు కానుందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు కార్తీ సోదరుడు హీరో సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
విజయ్ సేతుపతి- త్రిష కాంబోలో వచ్చిన రొమాంటిక్ డ్రామా 96 ఫేం ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నాడు కార్తీ. మొత్తానికి ఇలా ఒకేసారి మూడు సినిమాల అప్డేట్స్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు కార్తీ అభిమానులు, మూవీ లవర్స్. ఇప్పటికే విడుదలైన జపాన్ ఇంట్రడక్షన్ వీడియోతోపాటు, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్ కాగా.. జపాన్‌లో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు.
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

