మంచి సినిమాకు దక్కిన అవార్డులు
ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో ‘బేబీ’ చిత్రం ఐదు అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం పాత్రికేయులతో ముచ్చటించింది.
ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో ‘బేబీ’ చిత్రం ఐదు అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం పాత్రికేయులతో ముచ్చటించింది. చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ ‘8 నామినేషన్స్కుగాను 5 దక్కడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు క్రిటిక్స్ మెచ్చిన బెస్ట్ మూవీ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది.
కల్ట్మూవీ తీస్తున్నామని షూటింగ్ సందర్భంగా దర్శకుడు మారుతి ఎంతగానో ప్రోత్సహించారు. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాం’ అన్నారు. చిన్న చిత్రాలకు అవార్డులు రావని నిరాశ పడేవారికి ఉత్సాహాన్నిచ్చేలా ‘బేబీ’ చిత్రానికి అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందని, దర్శకుడు సాయిరాజేష్ ప్రతిభపై తనకు మొదటి నుంచి నమ్మకం ఉందని దర్శకుడు మారుతి చెప్పారు.
ఈ సినిమా తమకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని, రివార్డులతో పాటు అవార్డులూ రావడం ఆనందంగా ఉందని చిత్ర నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ‘బేబీ’ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

