BABY Movie | వామ్మో బేబి సినిమా రన్ టైమ్ మరీ అంత ఎక్కువా.. ఆడియెన్స్ కూర్చుంటారా?
Baby Movie Run Time | ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో కాస్తో కూస్తో మెప్పించగలిగేది బేబి సినిమానే అనిపిస్తుంది. ప్రచార చిత్రాల దగ్గర నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులలో అమితాసక్తి నెలకొంది.
Baby Movie Run Time | ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో కాస్తో కూస్తో మెప్పించగలిగేది బేబి సినిమానే అనిపిస్తుంది. ప్రచార చిత్రాల దగ్గర నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులలో అమితాసక్తి నెలకొంది. దానికి తోడు ఆర్నెళ్ల కిందట విడుదలైన ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట యూట్యూబ్ సహా ఇతర మ్యూజిక్ ఫ్లాట్‌ఫార్మ్‌లలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. జనాలు ఈ పాటను రిపీటెడ్ మోడ్‌లో పెట్టుకుని మరీ వింటున్నారు. ఇక రీసెంట్గా రిలీజైన ట్రైలర్ సైతం ప్రేక్షకుల్లో వీర లెవల్లో అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా యూత్‌ను తెగ ఆకట్టుకుంది.
జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన కలర్‌ఫోటో సినిమాకు కథనందించి, నిర్మాతగా వ్యవహరించిన సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకుడు. సంపూర్ణేష్ బాబుకు ఓవర్ నైట్ గుర్తింపు తీసుకొచ్చిన హృదయ కాలేయం సినిమాను తెరకెక్కించింది కూడా సాయి రాజేషే. అలాంటి దర్శకుడి నుంచి బేబి సినిమా వస్తుండంతో ప్రేక్షకుల్లో సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. పైగా ముందు నుంచి ఈ సినిమా క్లైమాక్స్ ఏడిపిస్తుందంటూ ఆర్ఎక్స్100 సినిమా రేంజ్లో ప్రమోట్ చేయడంతో.. అంతలా ఈ సినిమాలో ఏముందా? అని ఒక రకమైన క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది.
మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమా నిడివి గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది. బేబి సినిమా ఏకంగా 2 గంటల 58 నిమిషాల రన్టైమ్తో ప్రదర్శితం కానుందని తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలు అంత రన్టైమ్తో వస్తున్నాయంటే ఒకే అనుకోవచ్చు కానీ.. లవ్‌స్టోరి సినిమాలను అంత సేపు చూడటమంటే గగనమే. అర్జున్ రెడ్డి, నువ్వు నాకు నచ్చావ్ వంటి రోమ్ కామ్ సినిమాలు మూడు గంటల నిడివితో వచ్చి అద్భుతాలు సృష్టించాయన్నది వాస్తవమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కథ, కథనం ఎంతో ఆసక్తికరంగా ఉంటే తప్ప ఒక ప్రేక్షకుడు మూడు గంటలు థియేటర్లో కూర్చోవడం అంటే పెద్ద సవాలే. మరీ ఈ సవాల్‌ను బేబి అధిగమిస్తుందో లేదో చూడాలి.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో షార్ట్ ఫిలింస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి హీరోయిన్గా నటించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న మనసానమః షార్ట్ ఫిలిం హీరో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించాడు. విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

