Babu Mohan | ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై కనిపించిన లెజండరీ కమెడీయన్..!
Babu Mohan | ఎనభై, తొంభైయవ దశకంలోని కమెడీయన్లలో బాబు మోహన్ ఒకరు. ఆయన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్విన ప్రేక్షకులెందరో. మరీ ముఖ్యంగా కోట శ్రీనివాస్‌తో కలిసి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.
Babu Mohan | ఎనభై, తొంభైయవ దశకంలోని కమెడీయన్లలో బాబు మోహన్ ఒకరు. ఆయన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్విన ప్రేక్షకులెందరో. మరీ ముఖ్యంగా కోట శ్రీనివాస్‌తో కలిసి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వాళ్ల సీన్స్ చూస్తుంటే ఇట్టే నవ్వు పెదాలపైకి వచ్చేస్తుంది. అంతలా నవ్వించారు. ఇక బాబు మొహన్ కోసమే అప్పట్లో రచయితలు స్పెషల్‌గా కామెడీ సీన్స్ కూడా రాసేవారట. ఒకనొక టైమ్‌లో బ్రహ్మానందంను కూడా డామినేట్ చేసే స్థాయికి ఎదిగిన బాబు మోహన్‌కు ఉన్నంటుండి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదీ కాకుండా కొత్త కొత్త కమెడీయన్లు పుట్టుకురావడంతో బాబు మోహన్ కెరీర్ చాలా స్లో అయింది.
అయితే అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే వచ్చాడు. అయితే గత కొన్నేళ్లుగా బాబు మోహన్ సినిమాలకూ దూరంగా ఉన్నాడు. కాగా తాజాగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన శ్రీమతి కమారి సినిమాలో బాబు మోహన్ జడ్జీ పాత్రలో కనిపించాడు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్లో బాబు మోహన్ సెకన్ల పాటు స్క్రీన్‌పై కనిపించి సంతోష పరిచాడు. మరో రెండు రోజుల్లో ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్‌పై ఓటీటీ ప్రియుల్లో మంచి ఆసక్తే నెలకొంది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి.
తాము ఎంతో ఇష్టపడే పాత ఇల్లును నిత్యామీనన్ వాళ్ల బాబాయ్ అన్యాయంగా లాక్కుంటాడు. ఆ ఇల్లును దక్కించుకోవాలంటే 6 నెలలోగా వాళ్ల బాబాయ్‌కు 38లక్షలు కట్టాల్సివస్తుంది. నెలకు 13వేలు సంపాదించే నిత్యా.. ఆ ఇల్లును ఎలాగైన దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంత తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు కావాలంటే బార్ పెట్టడం కరెక్ట్ అని భావించి ఊర్లో బారును ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో చాలా ఫన్నీగా ఈ సిరీస్‌ను రూపొందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

