‘బాహుబలి’ ప్రభాకర్, శకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై రావుల రమేష్ నిర్మిస్తున్నారు. పాలిక్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షులు వై.కాశీవిశ్వనాథ్ క్లాప్‌నివ్వగా, ప్రసన్నకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ ‘రిటైర్డ్ ఆర్మీ అధికారి జీవితంలో ఓ రాత్రి ఏం జరిగిందన్నదే చిత్ర కథ. ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. దర్శకుడు పాలిక్ రెండేళ్ల క్రితమే ఈ కథ చెప్పారు.
నా పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా అందరిని ఆకట్టుకుంటుందని, ప్రభాకర్ పాత్ర రెండు కోణాల్లో సాగుతుందని దర్శకుడు తెలిపారు. చలపతిరావు, సుధ, జీవా, సౌజన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మల్లిక్ కె చంద్ర, సంగీతం: జాన్, పాటలు: సురేష్ గంగుల, కథ: వింధ్యరెడ్డి, స్క్రీన్‌ప్లే, మాటలు, నృత్యాలు, దర్శకత్వం: పాలిక్.