Megaster Chiranjeevi | మెగా 156 కోసం అవార్డ్ విన్నింగ్ టైటిల్..?
Chiranjeevi - Vassishta | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. బింబిసార ఫేం వశిష్ట (Vassishta) దర్శకత్వంలో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Chiranjeevi – Vassishta | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. బింబిసార ఫేం వశిష్ట (Vassishta) దర్శకత్వంలో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ జోనర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.
ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి(Cinare) రచించిన పద్య కావ్యము ‘విశ్వంభర’. ఈ గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ఇప్పుడు మెగాస్టార్ 156 చిత్రానికి కూడా ‘విశ్వంభర’ అనే పేరుని పరిశీలిస్తున్నారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇక ‘విశ్వంభర’ అంటే.. భూమి, విశ్వమును పాలించువాడు, ఇంద్రుడు, విష్ణువు అనే అర్ధాలు వున్నాయి. ఈ సినిమా కథ కూడా ముల్లోకాల నేపథ్యంలో వుంటుందని.. అందుకే ఈ టైటిల్ సరిగ్గా సరిపొతుందని యూనిట్ భావిస్తోందని తెలుస్తుంది. కాగా.. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌పై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

