Avinash: జత కలిసే అంటూ ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన అవినాష్

జబర్ధస్త్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అవినాష్ ..బిగ్ బాస్ షోతో మరింత దగ్గరయ్యాడు. సీజన్ 4కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు మంచి వినోదం పంచాడు. అంతేకాదు వీలున్నప్పుడల్లా తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేవాడు.ఒకానొక సమయంలో ఈయనకు ఇప్పట్లో పెళ్లి కాదా ఏంటి, ఇంతగా తహతహలాడుతున్నాడు అంటూ నెటిజన్స్ ముచ్చటించుకున్నారు.
ఎట్టకేలకు ఇటీవల తన సోషల్ మీడియాలో అనుజ అనే అమ్మాయితో తన నిశ్చితార్థం జరిగిందని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని అది ఫిక్స్ కాగానే ఆ విషయం తెలియజేస్తానని పేర్కొన్నాడు అవినాష్. అయితే తాజాగా జత కలిసే పేరుతో ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేశాడు. ఇందులోఅవినాష్ కుటుంబ సభ్యులు సందడి చేస్తూ కనిపించారు.
పూలు పండ్లు మార్చుకోవడం,ఆ తర్వాత అనుజతో అవినాష్ ఫొటో షూట్ చేయడం, కాబోయే శ్రీమతికి రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వంటివి వీడియోలో చూపించారు. ప్రస్తుతం అవినాష్ ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్ బాస్ తర్వాత అవినాష్.. అరియానాల వివాహం జరుగుతుందని అంతా అనుకున్నారు. కాని అనుజతో నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చాడు అవినాష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anuja
- avinash
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

