Avatar-2 Movie Collections | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘అవతార్-2’ హవానే కనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 2009లో వచ్చిన ‘అవతార్’ ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి మనల్ని కూడా అందులోకి తీసుకెళ్ళిపోయాడు. అప్పట్లో ఈ చిత్రం దాదాపు 10వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా సీక్వెల్‌ను అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అదే అంచనాలతో డిసెంబర్ 16న రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు రాబడుతుంది
మొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్.. ఈ సారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్‌తో ప్రేక్షకులను మాయ చేశాడు. కాగా ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ వసూళ్లు సాధిస్తూ గత రికార్డులను బ్రేక్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రం 1బిలియన్ మార్కును టచ్ చేసింది. అంటే దాదాపు 8వేల రెండోందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఒక్క హాలీవుడ్‌లోనే కాదు ఇండియాలోనూ ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఇండియాలో రూ.274 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగులో అవతార్-2 మూవీ రూ.52 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం ఇదే మొదటి సారి.