Avatar-2 Movie | టైటానిక్ కలెక్షన్లను దాటేసిన అవతార్-2.. టాప్-3 గ్రాసర్‌గా సరికొత్త రికార్డు
మొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్.. ఈ సారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్‌తో మాయ చేశాడు. సినిమా రిలీజై రెండు నెలలు దగ్గరికొస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అవతార్ హవానే కొనసాగుతుంది.
Avatar-2 Movie | ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ‘అవతార్-2’ గతేడాది డిసెంబర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకారు. మొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్.. ఈ సారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. విజువల్స్‌తో మాయ చేశాడు. సినిమా రిలీజై రెండు నెలలు దగ్గరికొస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అవతార్ హవానే కొనసాగుతుంది. అయితే ఇండియాలో ఈ సినిమాకు ఎండింగ్ కార్డు పడినా.. పక్క దేశాలలో మాత్రం ఇంకా దీని జోరే నడుస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా టైటానిక్ కలెక్షన్లు దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
టైటానిక్($2.217 బిలియన్) పేరిట ఉన్న రికార్డును అవతార్-2 తాజాగా బ్రేక్ చేసి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో టాప్-3 ప్లేస్‌ను కైవసం చేసుకుంది. మొదటి రెండు స్థానాల్లో అవతార్-1, అవేంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాలున్నాయి. మిక్స్డ్ టాక్‌తోనే ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించిందంటే జేమ్స్ క్యాలిబరీ ఎంటో ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా ఇండియాలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అవతార్-2 మూవీ ఇండియాలో అత్యధిక కలెక్సన్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఫుల్‌రన్ ముగిసే సరికి ఇండియాలో రూ.386.90 కోట్ల కలెక్షన్లు సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

