Chandrahas | బుల్లితెర ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడు, ‘యాటిట్యూడ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రహాస్ కథానాయకుడిగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను చిత్రయూనిట్‌తో కలిసి ప్రేక్షకుల మధ్య చూసిన చంద్రహాస్ సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ప్రేక్షకుల స్పందన చూసి తనకు మాటలు రావడం లేదని ముఖ్యంగా చివరి పది నిమిషాలలో సన్నివేశాలు తనను ఎంతగానో కదిలించాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో మ్యూజిక్ లేకుండా కేవలం రఫ్ కట్ మాత్రమే చూశానని, ఇప్పుడు వెండితెరపై పూర్తిస్థాయి అవుట్‌పుట్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక వివాదం తనను చాలా ఆందోళనకు గురిచేసిందని.. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను పాడిన ఒక పాట వలన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడం, దానివల్ల ప్రేక్షకులు థియేటర్లకు రారేమో అన్న భయం తనలో ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సినిమాకు వచ్చిన ప్రేక్షకులను చూసి చాలా సంతోషం వేయడంతో పాటు ధైర్యం వచ్చిందంటూ చంద్రహాస్ చెప్పుకోచ్చాడు. ఇక సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించగా, అర్జున్ మహి విలన్ పాత్రలో కనిపించారు. గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని సంయుక్తంగా నిర్మించారు.