సస్పెన్స్, క్రైమ్ జానర్లో తెరకెక్కిన చిత్రం ‘అథర్వ’. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధానపాత్రధారులు. మహేశ్‌రెడ్డి దర్శకుడు. సుభాష్ నూతలపాటి నిర్మాత. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు శశికుమార్ తిక్కా, హీరో చైతన్యరావులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘క్లూస్ డిపార్ట్మెంట్ని క్లుప్తంగా చూపించబోతున్నాం. ఉత్కంఠను రేకెత్తించే విధంగా కథ, కథనాలు సాగుతాయి. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా’ అని దర్శకుడు చెప్పాడు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.