అప్పట్లో తమ పెళ్లి ముచ్చట చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ తారలు వికీ కౌశల్, కత్రీనా కైఫ్. ఈ జంట ప్రేమలో పడుతుందని, పెళ్లి చేసుకుంటారని ఎవ్వరూ ఊహించకపోవడమే ఇలా అవాక్కయ్యేందుకు కారణం. మిగతావారి దాకా ఎందుకు.. ఇలా జరుగుతుందని తానే అనుకోలేదని అంటున్నది కత్రీనా. అసలు వికీ నా ఆలోచనల్లో కూడా ఉండేవాడు కాదని చెబుతున్నది.
ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న కత్రీనా తమ ప్రేమ, పెళ్లి గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ…‘అప్పటిదాకా వికీ కౌశల్ పేరు వినడమే తప్ప అతన్ని కలిసింది గానీ, ఇద్దరం సినిమాలో నటించింది గానీ లేదు. ఒక పార్టీలో మేము పరిచయం అయ్యాం. అతని వ్యక్తిత్వం గురించి తెలిశాక నన్ను గెల్చుకున్నాడు అనిపించింది. నేను ఎవరి దగ్గరికి చేరాలో అక్కడే వచ్చాను. వికీని నేను ప్రేమిస్తున్నాననే విషయం అందరికంటే ముందు దర్శకురాలు జోయా అక్తర్‌కు తెలుసు. వికీ, నేను చేసే పనుల్లో, ఆలోచనల్లో, ప్రవర్తనలో చాలా సారూప్యతలు ఉన్నాయి’ అని చెప్పింది.