Agent Movie | ఏజెంట్ సినిమా అటు నిర్మాతను, ఇటు డిస్ట్రిబ్యూటర్లను నిండా ముంచింది. పాతిక కోట్ల మార్కెట్ కూడా లేని అఖిల్‌తో ఎనభై కోట్ల బడ్జెట్‌తో సినిమా తీశారంటే కంటెంట్ ఏ రేంజ్లో ఉండి ఉండాలే. ప్రస్తుతం కంటెంట్ యుగం నడుస్తుంది. కంటెంట్‌తో వస్తే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్లో కళ్లు చేదిరే కలెక్షన్లు తెచ్చిపెడుతున్నాయి. అలాంటిది బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ముందుగా యాబై కోట్లు లెక్కలేసి.. ఆపై మళ్లీ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసారు. తీరా బడ్జెట్లో సగం రేటుకే సినిమాను అమ్మేశారు. పోని అదైన వచ్చిందా అంటే అదీ లేదు. బడ్జెట్లో పదిశాతం కూడా రికవరీ చేయలేకపోయింది.
ఇక ఈ సినిమా ఫేయిల్యూర్‌ను అనీల్ సుంకర నిర్మొహమాటంగానే ఒప్పేసుకున్నాడు. ఈ సినిమాను తక్కువ రేటుకే కొన్నప్పటికి బయ్యర్లు తీవ్ర నష్టాల్ని చూశారు. కాగా ఈ సినిమా హక్కులను కొనబోయి వెనక్కి తగ్గిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. దేవుడే తమను కాపాడాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏజెంట్ థియేట్రికల్ హక్కులను తనతో సహా ఆరుగురు కలిపి తీసుకోవాలని అనుకున్నట్లు సునీల్ నారంగ్ తెలిపాడు. దాంతో హక్కుల కోసం నిర్మాత అనిల్‌ను సంప్రదిస్తే, ఆయన భారీ రేటు చెప్పారని.. అది తమకు గిట్టుబాటు కాదని భావించి వేరే వాళ్లకు సినిమాను ఇచ్చుకోమని చెప్పి తాము వెనక్కి తగ్గినట్లు సునీల్ నారంగ్ తెలిపాడు. అంతేకాకుండాఈ సినిమా రైట్స్ తీసుకోకుండా దేవుడే తమను కాపాడాడంటూ ఆయన సెటైర్ వేశాడు.
ఇక అనిల్ సుంకర ఇన్నేళ్లలో సినిమాల ద్వారా సంపాదించిందంతా ఇక్క ఏజెంట్ సినిమాతో పోగొట్టుకున్నట్లు సన్నిహితుల సమాచారం. ఇప్పుడు ఆయన ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘భోళా శంకర్’ మీదే ఉన్నాయి. ఆగస్టు 11న రిలీజయ్యే ఈ చిత్రం ‘ఏజెంట్’ నష్టాలను కొంతమేర అయినా భర్తీ చేస్తుందని ఆయన ఆశిస్తున్నాడు. ఇక ఏజెంట్ ఓటీటీ రిలీజ్లోనూ గందరగోళమే ఉంది. అప్పుడెప్పుడో ఓటీటీ డేట్ అనౌన్స్ చేసి ఇప్పటివరకు స్ట్రీమింగ్ చేయలేదు. మరోసారి కత్తెరకు పనిచెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక శుక్రవారం కన్ఫర్మ్గా రిలీజవుతుందని వచ్చిన ఇప్పటివరకు ఈ సినిమా జాడే లేదు.