Mr X | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్లు కోలీవుడ్ యాక్టర్ ఆర్య. గౌతమ్ కార్తీక్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ‘మిస్టర్ ఎక్స్’(Mr X). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కమార్ నిర్మిస్తున్నారు.
ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను రియలిస్టిక్‌గా ఉండేలా ఆర్య ఎలాంటి డూప్స్ లేకుండా చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఆర్య షార్ట్ మినహా ఎలాంటి దుస్తులు లేకుండా ఐస్‌కోల్డ్ వాటర్‌లో 20 అడుగుల లోతులోకి దిగి.. భయానికి భయం పుట్టించేలా షూట్లో పాల్గొన్న మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రాన్ని ఉగాండా, అజర్బైజాన్, జార్జియా వంటి దేశాల్లో షూట్ చేశారు. ఈ మూవీలో శరత్‌కుమార్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిబు నివాస్ థామస్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
No stunt double 🔥No shortcuts 🔥
Just one man, one shot. #Arya @arya_offl dove 20 feet into ice-cold water, body bare, exactly as #MrX demanded — and he delivered. Pure commitment. Absolute fearlessness. This is what legends are made of. 🔥
pic.twitter.com/SbXLXGbmc5— BA Raju’s Team (@baraju_SuperHit) April 13, 2026
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!