Dear Megha | బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మైనస్ అయ్యింది

‘నేను ఇమేజ్ గురించి పట్టించుకోను. కథ నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధమే’ అనిఅన్నారు అరుణ్ అదిత్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదివారం హైదరాబాద్‌లో అరుణ్ అదిత్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడు సుశాంత్‌తో నాకు పదేళ్లుగా పరిచయముంది. తనకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. తన శైలికి భిన్నంగా ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో ఈ సినిమా చేశారు. సాధారణంగా సినిమాల్లో ప్రేమకథలన్నీ కథానాయకుడి ధృక్కోణం నుంచే సాగుతాయి. అందుకు భిన్నంగా నాయిక ప్రధానంగా సాగే చిత్రమిది. ఓ అబ్బాయితో ప్రేమలో పడిన అమ్మాయి కథ ఇది. ఆమె జీవితంలోకి మరో యువకుడు ఎలా వచ్చాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఆనందంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం నటుడిగా నాకు మైనస్ అయ్యింది. ఆ కారణం వల్లే ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నా. దేవుడిచ్చిన కళను నమ్ముకుంటూ ఉన్నదానితో సంతృప్తిపడాలని ఈ ప్రయాణంలో అర్థంచేసుకున్నా. ప్రతి రంగంలో బ్యాక్‌గ్రౌండ్ పరమైన సమస్యలుంటాయి. ప్రస్తుతం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ‘కథ కంచికి మనం ఇంటికి’తో పాటు అమలాపాల్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

