Laxman Arogya Gramam | ఆహారమే ఔషధం.. ఘనంగా ‘లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం’ ప్రథమ వార్షికోత్సవం
Laxman Arogya Gramam | మందుల కంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటైన 'లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం' విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆహార కల్తీ మరియు శారీరక శ్రమకు దూరమవుతున్న నేటి తరం పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యతను చాటుతూ ఈ సంస్థ ముందుకు సాగుతోంది.
మందుల కంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటైన ‘లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆహార కల్తీ మరియు శారీరక శ్రమకు దూరమవుతున్న నేటి తరం పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యతను చాటుతూ ఈ సంస్థ ముందుకు సాగుతోంది. ఆహారపు అలవాట్ల నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు, సంపూర్ణ ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ ఆరోగ్యగ్రామాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో లక్ష్మణ్ పూడి ఈ ప్రాంగణాన్ని స్థాపించారు. ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అరుణోదయ విమలక్క, సుమన్ టీవీ వ్యవస్థాపకుడు సుమన్ దూది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే సినీ రంగం నుంచి నటుడు సప్తగిరి, కిరాక్ ఆర్పీ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొని నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే, ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకునే అలవాట్లను పెంపొందించుకోవాలని ఈ వేదిక ద్వారా సందేశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆహార కల్తీ తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, కొన్ని హోటళ్లు మరియు రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా ప్రజలకు హానికరమైన ఆహారాన్ని అందించడం బాధాకరమని అన్నారు. తదుపరి తరాలకు స్వచ్ఛమైన నీరు, నాణ్యమైన ఆహారం అందించడమే అసలైన సంపద అని ఆయన పేర్కొన్నారు. జెన్‌జీ యువత ఆహారపు అలవాట్లు, కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేకపోవడం మాత్రమే కాదని, శారీరక, మానసిక శ్రేయస్సును కాపాడుకోవడమేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, లక్ష్మణ్ ఆరోగ్యగ్రామాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు సినీ రంగానికి చెందిన చిన్న నిర్మాతలు, దర్శకులు తమ సినిమా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకునేలా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నట్లు లక్ష్మణ్ పూడి తెలిపారు. ఇందుకు అవసరమైన సదుపాయాలతో పాటు ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. వినోద రంగం ద్వారా ఆరోగ్యంపై అవగాహనను మరింత విస్తృతం చేయవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

