Arjun Reddy | టాలీవుడ్ గేమ్ చేంజర్ అర్జున్ రెడ్డికి ఆరేళ్లు.. సందీప్ రెడ్డి మొండి పట్టే ట్రెండ్ సెట్టర్‌గా నిలబడేలా చేసింది..!
Arjun Reddy@6 Years | అప్పటివరకు తెలుగు సినిమాలు ఒక మూస ధోరణిలో వెళ్తున్నాయి. తెలుగు సినిమా అంటే ఇదే.. దీన్ని మించి దాటకూడదు అని ఒక వలయం ఏర్పరుచుకుంది. అదే సమయంలో సందీప్ రెడ్డి అనే వరంగల్ పిల్లగాడు అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో వచ్చి తెలుగు సినిమా రూపు రేఖలను మార్చేశాడు.
Arjun Reddy@6 Years | అప్పటివరకు తెలుగు సినిమాలు ఒక మూస ధోరణిలో వెళ్తున్నాయి. తెలుగు సినిమా అంటే ఇదే.. దీన్ని మించి దాటకూడదు అని ఒక వలయం ఏర్పరుచుకుంది. అదే సమయంలో సందీప్ రెడ్డి అనే వరంగల్ పిల్లగాడు అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో వచ్చి తెలుగు సినిమా రూపు రేఖలను మార్చేశాడు. మూడు దశాబ్దాల కిందట వచ్చిన శివ టాలీవుడ్ సినిమాలో ఎలా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందో.. ఆరేళ్ల కిందట వచ్చిన అర్జున్ రెడ్డి సైతం అదే స్థాయిలో టాలీవుడ్ గేమ్ చేంజర్‌గా నిలిచింది. కల్ట్ క్లాసిక్ సినిమా అంటూ బిరుదులు పెట్టేశారు. ఇక సందీప్ రెడ్డి విజన్‌కు ఏమాత్రం తీసిపోని రేంజ్లో విజయ్ దేవరకొండ టెర్రిఫిక్ పర్మామెన్స్కు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. యూత్‌లో ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు.
ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండను ఈ సినిమా ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. మేటి మేటి హీరోలు సైతం విజయ్ నటనను చూసి వెర్రెత్తిపోయామని చెప్పడం గమనార్హం. ముందుగా ఈ సినిమా కథ శర్వానంద్ సహా పలువురు హీరోల దగ్గరకి వెళ్లింది. కానీ పలు కారణాల ఆ హీరోలు చేయలేకపోయారు. నిర్మాతలు సైతం చేతులెత్తేశారు. కొందరు నిర్మాతలు మాత్రం సినిమా చేయలంటే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని ఖరాకండిగా చెప్పేశారు. కానీ సందీప్ సీన్లు కాదు కదా ఒక్క ఫ్రేమ్ కూడా మార్చను తెగేసి చెప్పాశాడట.
సందీప్ బాధ చూడలేక వాళ్ల అన్న ప్రణయ్ రెడ్డి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. ముందుగా లెక్కలేసుకున్న బడ్జెట్ రెండింతలైంది. అయినా కానీ కంటెంట్ మీదున్న నమ్మకంతో ఏ ఒక్కరు తగ్గలేరు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టారు. ఫైనల్‌గా అన్నీ కలుపుకుని రూ.5 కోట్ల ఖర్చు తేలింది. ప్రమోషన్లు గట్రా పైన మరో పాతిక లక్షలు ఖర్చయింది. అప్పటికే రిలీజైన టీజర్ సంచలనం కావడం, ట్రైలర్ సహా పాటలు జనాలకు విపరీతంగా నచ్చేయడంతో సినిమాపై తిరుగులేని హైప్ వచ్చేసింది. దాంతో సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. కాగా డిస్ట్రిబ్యూటర్లకు రూ.6కోట్లకు సినిమాను అమ్మారు. కట్ చేస్తే ఫస్ట్ వీకెండ్లోనే పెట్టిన మొత్తం తిరిగివచ్చేసింది.
నాన్ స్టాప్‌గా రెండు, మూడు వారాలు హౌజ్‌ఫుల్ బోర్డులతో అర్జున్ రెడ్డి థియేటర్లు కలకలలాడాయి. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. ఫైనల్ రన్లో రూ.25.8 కోట్ల షేర్‌ను యాభై కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన టాలీవుడ్ సినిమాల్లో టాప్-10లో అర్జున్ రెడ్డి ఉంటుంది. థియేటర్లలో మూడు గంటల పాటు ఒక ప్రేక్షకుడిని కూర్చొబెట్టారంటే మాములు విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే ఆరేళ్ల వెనక్కి.. ఆ యుఫోరియాలోకి వెళ్లిపోతుంటాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

