జబర్ధస్త్ కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించిన అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు.ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే కార్యక్రమంలో డిఫరెంట్ స్కిట్స్ వేస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అవినాష్ టాలెంట్ ఏంటో అందిరికి అర్ధమైంది. ఇక అదే సమయంలో అరియానాతో అవినాష్ చేసిన రచ్చ అందరిలో పలు అనుమానాలు కలిగించింది.
హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా అరియానా- అవినాష్‌లు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరిని చూసి అందరు ప్రేమలో ఉన్నారని భావించారు. పెళ్లి చేసుకుంటారేమో అని కూడా అనుకున్నారు. కాని ఆశ్చర్యంగా అవినాష్ తన ఫియాన్సీ పరిచయం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.రీసెంట్ గా వీరి నిశ్చితార్థం కాగా, ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు పేర్కొన్నాడు.
అయితే త్వరలో జరగనున్న అవినాష్ పెళ్లిపై అరియానా స్పందించింది. మా మధ్య ఏదో ఉండేదని ఎన్నో పుకార్లు వచ్చాయి. మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. అవినాష్ నాకు స్నేహితుడు మాత్రమే.. అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టినట్టు చెబుతూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని తెలిపింది.