Thalaivi Movie | చరిత్రను వక్రీకరించలేదు

‘చరిత్రలో జరిగిన సంఘటనల గురించి అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి సినిమాల్లో కొత్తగా చూపించేది ఏమీ ఉండదు. ‘తలైవి’ చిత్రంలో వ్యక్తుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు’ అని అన్నారు సీనియర్ నటుడు అరవింద్‌స్వామి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా రూపొందిస్తున్న ‘తలైవి’ చిత్రంలో అరవింద్‌స్వామి లెజెండరీ నటుడు ఎంజీఆర్ పాత్రను పోషించారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా అరవింద్‌స్వామి పాత్రికేయులతో పంచుకున్న మనోభావాలివి..
సవాలుగా తీసుకున్నా..
నేను ఎంజీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను. తమిళనాడు సాంఘిక, సాంస్కృతిక గమనాన్ని ప్రభావితం చేసిన ఎంజీఆర్ పాత్రను చేయడం గొప్ప బాధ్యతగా భావించాను. కేవలం సినీరంగంలోనే కాకుండా తమిళనాడు రాజకీయ వేదికపై ఎంజీఆర్ అత్యంత ప్రభావశీల నాయకుడిగా ప్రజల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఆయన మేనరిజమ్స్, శారీరక భాషను అర్థం చేసుకొని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అతిపెద్ద సవాలుగా అనిపించింది.
ఇమిటేట్ చేయలేదు..
ఎంజీఆర్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరు నా పాత్రను చూసి ఆనందించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ సినిమా కోసం పనిచేశాను. దాదాపు ఏడాదిన్నరగా పూర్తిస్థాయిలో ఈ సినిమాపైనే దృష్టిపెట్టా. సాధారణంగా బయోపిక్ అంటే వ్యక్తులకు సంబంధించిన హావభావాల్ని అనుకరిస్తే సరిపోతుందనుకుంటారు. అది చాలా తప్పు. ఈ సినిమా కోసం నేను ఎంజీఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాల గురించి తెలుసుకున్నా. ఆయన వ్యక్తిత్వం, భిన్న పరిస్థితుల్లో ఆయన ప్రవర్తించే విధానాల గురించి అధ్యయనం చేశాం. అన్నింటికంటే ముఖ్యం స్క్రిప్ట్‌లోని భావోద్వేగాల్ని ఆకళింపు చేసుకొని నటించా. అందుకే నేను ఎంజీఆర్‌గారి పాత్రను అనుకరించినట్లు కనిపించదు. వివిధ వయోదశల్లో ఎంజీఆర్ ఒక్కోరకంగా కనిపిస్తారు.అందుకు అనుగుణంగా నేను నాలుగు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను.
వివాదాలకు దూరం
బయోపిక్ అనగానే వాస్తవాల్ని వక్రీకరిస్తారని, వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తారనే అపోహ ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి వివాదాలకు తావు ఉండదు. ఎంజీఆర్లోని రాజకీయ కోణంతో పాటు మానవీయ పార్శాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. చరిత్రలో జరిగిన సంఘటనల పట్ల అందరి దృష్టికోణం ఒకేలా ఉండదు. విషయప్రామాణికత విషయంలో కూడా ఎలాంటి రుజువులు ఉండవు కాబట్టి ఈ సినిమాలో వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాం.
దర్శకత్వంపై ఆసక్తి..
సినిమా చూసిన తర్వాత ఎంజీఆర్ పాత్రకు నా పరిధిలో పరిపూర్ణంగా న్యాయం చేశాననే సంతృప్తి కలిగింది. నా కెరీర్లో గుర్తుంచుకునే పాత్రగా మిగిలిపోతుంది. ఇక హైదరాబాద్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి ఆహారాన్ని చాలా ఇష్టపడతాను. ‘రోజా’ చిత్రం నుంచి ఈ సిటీతో బంధం పెనవేసుకుపోయింది. ఎప్పుడు వచ్చినా ఇక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తారు. ‘నవరస’ వెబ్‌సిరీస్‌లో ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించాను. స్వతహాగా నాకు డైరెక్షన్‌పై ఆసక్తి ఎక్కువ. భవిష్యత్తులో నటనతో పాటు దర్శకత్వంపై కూడా దృష్టిపెడతా. ఇప్పటికే నాలుగు కథల్ని సిద్ధం చేసుకున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arvainda swami
- MGR
- Thalaivi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

