AK62 | అజిత్ సినిమాలో విలన్‌గా సీనియర్ స్టార్ హీరో?
‘ప్రేమ పుస్తకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్.. వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మిగితా తమిళ హీరోలతో పోలిస్తే తెలుగులో ఈయన మార్కెట్ కాస్త తక్కువే.
Ajith Kumar | ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్.. వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మిగితా తమిళ హీరోలతో పోలిస్తే తెలుగులో ఈయన మార్కెట్ కాస్త తక్కువే. అంతేకాకుండా అజిత్ కూడా మొదటి నుండి తెలుగు మార్కెట్‌పై అంతగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఆయన తెగింపు సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. ఇక అజిత్ తన తదుపరి సినిమాను విఘ్నేష్ శివన్‌తో చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక జనవరి 19 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్‌గా అరవింద్ స్వామి నటించనున్నాడట. ఈయన పాత్ర కూడా స్టైలిష్‌గా ధృవ సినిమాలో లాగా ఉంటుందని టాక్. అరవింద్ స్వామితో పాటు సంతానం కూడా కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అజిత్ డాన్ పాత్ర పోషించనున్నాడు. అజిత్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

