Tamanna-Raashi Khanna | హారర్‌కి అందం తోడైతే!?.. బాక్లో రెచ్చిపోయిన తమన్నా, రాశీఖన్నా
హారర్ కామెడీ సినిమాలు తీయడంలో దర్శకుడు సుందర్.సి.ది ప్రత్యేకశైలి. తమిళంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అరణ్మనై’ ఫ్రాంఛైజ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది.
Tamanna-Raashi Khanna | హారర్ కామెడీ సినిమాలు తీయడంలో దర్శకుడు సుందర్.సి.ది ప్రత్యేకశైలి. తమిళంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అరణ్మనై’ ఫ్రాంఛైజ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. ఈ ఫ్రాంఛైజ్‌లో నాలుగో సినిమా ‘అరణ్మనై 4’ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో ‘బాక్’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు ఖుష్బు సుందర్, ఏసీఎస్ కుమార్. సుందర్.సి. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలో ‘పంచుకో..’ అటూ సాగే ఓ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
సాహితీ రాసిన ఈ గీతాన్ని హిపాప్ తమిళా స్వరపరచగా, రాఘవి హస్కీ వాయిస్‌లో ఆలపించారు. ఈ పాటకు చెందిన వీడియో గురించి మేకర్స్ చెబుతూ ‘తమన్నా, రాశీఖన్నాల గ్లామర్ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. వారి గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ట్రెండీ లుక్‌లో ఇద్దరూ అదరగొట్టేశారు. కథలోని కొన్ని ఎక్సయింటింగ్ సన్నివేశాలను కూడా ఇందులో కలపడంతో చూసినవారంతా బావుందని అభినందిస్తున్నారు’ అని తెలిపారు. వెన్నెల కిశోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్, కోవై సరళ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఇ.కృష్ణమూర్తి అకా కిచ్చ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

