గోపీచంద్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. బి. గోపాల్ దర్శకుడు. తాండ్ర రమేష్ నిర్మించారు. ఈ నెల 8న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘మాస్ అంశాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బెజవాడ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. తండ్రి లక్ష్యాన్ని ఓ తనయుడు ఎలా సాధించాడు? కాశీ అనే రౌడీతో అతడికి ఉన్న పగకు కారణమేమిటన్నది ఈ చిత్ర ఇతివృత్తం. గోపీచంద్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. పోరాట ఘట్టాలు అలరిస్తాయి’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: బాల మురుగన్.