Beast | విడుదలకు ముందే ‘బీస్ట్’ మరో రికార్డు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థలపతి పరిచయం అక్కర్లేని పేరు. ‘తుపాకీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంతో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు.
Arabic kuthu song | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థలపతి పరిచయం అక్కర్లేని పేరు. ‘తుపాకీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంతో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈయన గత చిత్రం ‘మాస్టర్’ తెలుగులో 14కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘బీస్ట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేశాయి. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును సాధించింది.
యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ‘అరబిక్ కుత్తూ’ సాంగ్ మరో ఘనతను సాధించింది. తాజాగా ఈ పాట 250మిలియన్ల వ్యూస్‌ను సాధించి సౌత్‌లో ఫాస్ట్‌గా 250మిలియన్ల వ్యూస్ సాధించిన పాటగ అరబిక్ కుత్తూ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో మారు మోగిపోయింది. పలువురు సినీప్రముఖులు కూడా ఈ పాట హూక్ స్టెప్స్‌ను వేశారు. ఈ పాటకు శివకార్తికేయన్ సాహిత్యం అందించగా, అనిరుధ్ ఆలపించాడు. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఏప్రిల్ 13న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Tremendous reach for #HalamithiHabibo 😍
Love ah konjama konjama yethi ipo 250M+ views 🔥📹 https://t.co/ZvW8cZvobn
🎵 https://t.co/7Sjf9VfsDQ@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @Siva_Kartikeyan @jonitamusic @manojdft @AlwaysJani #ArabicKuthu #Beast pic.twitter.com/sEUFHzn5hz— Sun Pictures (@sunpictures) April 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

