మొక్కిందోటి..దక్కిందోటి
ప్రేమ, పెళ్లి విషయాల్లో సుందరానికి నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. జీవితాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకుండా సరదాగా గడపటం అతని నైజం. ప్రేమకు ఆమడ దూరంలో ఉండే సుందరం జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మా సినిమా కథ’ అన్నారు వివేక్ ఆత్రేయ. ఆయన దర్శకత్వంలో నాని, నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్. వై నిర్మాతలు. జూన్ 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాలోని మూడో గీతం ‘రంగో రంగా’ సోమవారం విడుదలైంది. ‘అనుకున్నదోటి..అయ్యిందోటి..రంగో రంగా..మొక్కిందోటి..దక్కిందోటి రంగో రంగా..’ అంటూ వినోదాత్మకంగా ఈ గీతం సాగింది. సుందరం పాత్ర నైజాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాటకు రూపకల్పన చేశారు. శనపతి భరద్వాజ్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని కారుణ్య ఆలపించారు. ‘ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది.
టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం పేర్కొంది. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

