ఇప్పటి వరకు అన్ని తరహా చిత్రాల్లో కథానాయకుడిగా కనిపించిన నాని త్వరలోనే తొలిసారిగా ఓ డార్క్ థ్రిల్లర్‌లో నటించబోతున్నాడు. నానితో ఇంతకు ముందు ‘అంటే సుందరానికి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల ఈ కథ విన్న నాని, వివేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.
పూర్తి వైవిధ్యమైన ఈ కథలో నాని పాత్ర కొత్తగా వుంటుందట. ఇటీవల రామ్‌చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.