Balakrishna #107 | పవర్ ఫుల్ టైటిల్‌తో బాలకృష్ణ నెక్ట్స్ చిత్రం?
Balakrishna #107 | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌ను తన నెక్ట్స్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బాలయ్య ఈ చిత్రంలో రెండు గెటప్‌లలో కనిపించబోతున్నట్లు టాక్. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు ‘అన్నగారు’ అనే టిటిల్ను ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రకు పొలిటికల్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినీయర్ ఎన్టీఆర్‌ను అభిమానులు అన్నగారు అంటూ ప్రేమగా పిలుచుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య బాబు పాత్రను ఉద్దేశించి ఈ టైటిల్ అయితే బావుంటుందని మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే గతంలో ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు చర్చలు జరిగాయి. కానీ దానిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈయన షూటింగ్లో పాల్గొన్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

