Anna Lezhneva | ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో నేరుగా ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత ఫోటోపై ఆమె స్పష్టత ఇచ్చారు. ‘తీన్మార్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ పక్కన ఒక విదేశీ మహిళ కూర్చుని ఉన్న ఫోటో చాలా కాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఆ ఫోటోలో కనిపిస్తున్న మహిళనే అన్నా లెజినోవా అని భావిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి ఆమె తాజాగా చెక్ పెట్టారు.
ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని, ఆ మహిళ పేరు డానా మార్క్స్ అని అన్నా లెజినోవా స్పష్టం చేశారు. చాలామంది పొరపాటుగా తన పేరును ప్రచారం చేస్తున్నారని చెప్పడంతో చాలా కాలంగా కొనసాగుతున్న అపోహలకు తెరపడింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆమె కొన్ని విషయాలు వెల్లడించారు. తాను ఎప్పుడూ మోడల్‌గా కానీ, నటిగా కానీ పనిచేయలేదని స్పష్టం చేశారు. ‘తీన్ మార్’ సినిమాలోని ఒక పాటలో తాను కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తానని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధంపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానమిచ్చారు. తమ వివాహానికి ముందు జరిగిన పరిచయం గురించి మాట్లాడుతూ, ప్రేమను మొదటగా పవన్ కల్యాణే వ్యక్తపరిచారని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
అన్నా లెజినోవా సోషల్ మీడియాలో ఇలా అభిమానులతో కలిసిపోవడం పట్ల జనసైనికులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇచ్చిన క్లారిటీతో వైరల్ ఫోటో చుట్టూ నెలకొన్న గందరగోళానికి పూర్తిగా ముగింపు పడింది. ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అన్నా లెజినోవా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తకిర విషయాలు వెల్లడిస్తుంది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.