Nithiin | మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు : నితిన్
నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). కాగా ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి స్పెషల్ సాంగ్‌లో మెరువబోతున్న విషయం తెలిసిందే. రా రా రెడ్డి పాటను విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది.
టాలీవుడ్ (Tollywood) హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి స్పెషల్ సాంగ్‌లో మెరువబోతున్న విషయం తెలిసిందే. రా రా రెడ్డి పాటను విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది.
ఈ పాట గురించి నితిన్ మాట్లాడుతూ..లిరికల్ వీడియో సాంగ్‌లో డ్యాన్స్ కు సంబంధించి మీరేమి చూడనట్టే. కానీ సిల్వర్ స్క్రీన్‌పై మీరు ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్‌లతో ప్రత్యేక అనుభూతిని పొందుతారు. ఈ సినిమాలో మరో డ్యాన్స్ నంబర్ కూడా ఉంది. శేఖర్‌కు ఇది తొలి సినిమా. ఈ సినిమా ఫెయిల్ అయితే అతని అడ్రస్ ఇస్తాను. లేదు కేవలం జోక్ చేస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది.
ఇది నాకు చాలా ప్రత్యేకమైన పాట. ఎందుకంటే నా తొలి సినిమా జయంలోని రాను రాను పాటను ఇందులో యాడ్ చేశారు. అంజలితో మొదటి సారి చేస్తున్నా. మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు. ఆమె ఎంతో సహకరించారు. అంజలి గతంలో చేసిన బ్లాక్ బాస్టర్ సాంగ్ కంటే మరింత బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆశిస్తున్నానన్నాడు నితిన్.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ మూవీని హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.
Read Also : The Warriorr pre release event | ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నో చీఫ్ గెస్ట్..!
Read Also : Mahesh Remuneration | రెమ్యునరేషన్ పెంచేసిన మహేశ్..క్రేజీ న్యూస్ నిజమేనా.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

