Brahmanandam | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. నాన్ హాలీడేస్ (వీక్ డేస్) లోనూ హౌల్ఫుల్ షోస్‌తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది. రణ్‌బీర్ జంటగా రష్మిక మందన్నా నటించగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, బాబీ డియోల్‌లు కీలక పాత్రలలో కనిపించారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.650 కోట్ల క్లబ్లో చేరగా.. వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీ సక్సెస్ కావడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు యూట్యూబ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం వెర్షన్లో క్రియేట్ చేసి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో ఈ వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో మీరు చూసేయండి.
Bramhi in & as Animal😁✂️
Share & Follow @TeluguBroEdits
.#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU— Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023