Animal Movie | ‘యానిమల్ కా ఎనిమీ’ను ఇంట్రడ్యూజ్ చేసిన మేకర్స్.. విలన్‌గా ఆ స్టార్ నటుడు
Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది.
Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తోపాటు, రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్ ఫస్ట్ లుక్, రష్మిక మంధాన ఫస్ట్ లుక్ లకు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇందులో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తుండగా. గీతాంజలిగా రష్మిక నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
‘యానిమల్’ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ (Bobby Deol) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘యానిమల్’ యొక్క శత్రువు అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబీ డియోల్ మెయిన్ విలన్ అని తెలుస్తుంది. ఇప్పటికే బాబీ డియోల్ లవ్ హాస్టల్ (Love Hostel) సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక యానిమల్‌లో బాబీ రోల్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Animal ka Enemy 🙂#Animal #AnimalTeaserOn28thSept#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPictures #KrishanKumar @TSeries @VangaPictures pic.twitter.com/yfDm7XrthY
— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 26, 2023
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్‌ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

