Agent Movie | ఏజెంట్ ఓటీటీ లేటుకు కారణం అది కూడా కాదా..!
Agent Movie Ott | సూపర్ హిట్టయిన సినిమాలే రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తుంటే.. అల్ట్రా డిజాస్టర్ అయిన ఏజెంట్ మాత్రం ఓటీటీ జాడ లేదు. ఆ మధ్య సోనిలివ్ సంస్థ అధికారికంగా ఓ డేట్‌ను ప్రకటించింది.
Agent Movie Ott | సూపర్ హిట్టయిన సినిమాలే రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తుంటే.. అల్ట్రా డిజాస్టర్ అయిన ఏజెంట్ మాత్రం ఓటీటీ జాడ లేదు. ఆ మధ్య సోనిలివ్ సంస్థ అధికారికంగా ఓ డేట్‌ను ప్రకటించింది. తీరా చూస్తే ఆ రోజున రాలేదు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయ్యింటుంది.. రెండు, మూడు రోజుల్లో వస్తుందనుకుంటే ఇప్పటికే నెల దాటిపోయింది. ఇంకా ఓటీటీలోకి రాలేదు. దాంతో మళ్లీ ఈ సినిమాను రీ-ఎడిట్ చేస్తున్నారని, కొత్త సీన్స్‌ను యాడ్ చేస్తున్నారని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ వాస్తవాలని అందులో ఎలాంటి నిజం లేదని తాజాగా ఈ సినిమా నిర్మాత అనీల్ వెల్లడించాడు.
ఒరిజినల్ ఫుటేజ్ తమ దగ్గరే ఉందని, సోనీ లివ్ వాళ్ళు ప్రత్యేకంగా ఎడిట్ చేయాలని అడగలేదని అనీల్ సుంకర సామజవగమన సక్సెస్ మీట్లో వెల్లడించాడు. ఎడిటింగ్ అన్నది వట్టి పుకారునని, ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలనేది వాళ్ల నిర్ణయం వాళ్ళ హక్కని తేల్చి చెప్పాడు. దాంతో ఇప్పటివరకు ఈ సినిమా ఎడిటింగ్ చేస్తున్నారన్నది అబద్దం అని క్లారిటీ వచ్చేసింది. అయితే సోని లివ్ వాళ్లు ఏజెంట్ సినిమాను ఇంకా ఎందుకు రిలీజ్ చేయడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

