Bhagavanth Kesari Movie | నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. బాలకృష్ణని సరికొత్తగా ప్రజెంట్ చేయడం, యాక్షన్ సీక్వెన్స్ లు సహజంగా వుండటం, శ్రీలీల కూతురి పాత్రలో కనిపించడం, తెలంగాణ యాస లో బాలయ్య చెప్పే డైలాగులు.. ఇవన్నీ సినిమాపైఆసక్తిని పెంచాయి.
అయితే ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాస మాట్లాడటానికి గల ప్రత్యేకమైన కారణం చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. ”తెలంగాణ యాసలో ముక్కుసూటి తనం వుంటుంది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం దానికి దగ్గరగా వుంటుంది. ఇది ఆయన మీద చేస్తే బాగా వర్క్ అవుట్ అవుతుందని బలంగా నమ్మాను. అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇందులో చాలా డైలాగ్స్ ఆయన నేచర్ కి దగ్గరగా వుంటాయి. డైలాగ్స్ బోల్డ్ గా వుంటాయి. డైలాగ్స్ థియేటర్స్ లో పేలుతాయి” అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.