Anil Ravipudi | తెలంగాణ యాసలో గొప్ప అందం ఉంటుంది
నేను ఇప్పటికి ఆరు సినిమాలు పూర్తి చేశాను. అంటే ఒక ఓవర్ పూర్తయిందన్నట్లు (నవ్వుతూ). ఈ చిత్రంతో నా కెరీర్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టాను. ఇక నుంచి కథాపరంగా పూర్తి వైవిధ్యాన్ని చూపించాలని నిర్ణయించుకున్నా.
‘భగవంత్ కేసరి’ చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్లో కొత్త ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టానని చెప్పారు అనిల్ రావిపూడి. ఇక నుంచి విభిన్నమైన కథలతో తన ప్రయాణం సాగుతుందన్నారు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి పాత్రికేయులతో పంచుకున్న సంగతులివి..
నేను ఇప్పటికి ఆరు సినిమాలు పూర్తి చేశాను. అంటే ఒక ఓవర్ పూర్తయిందన్నట్లు (నవ్వుతూ). ఈ చిత్రంతో నా కెరీర్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టాను. ఇక నుంచి కథాపరంగా పూర్తి వైవిధ్యాన్ని చూపించాలని నిర్ణయించుకున్నా. ‘భగవంత్‌కేసరి’ భావోద్వేగభరితంగా సాగే ఎమోషనల్ డ్రామా. ఈ కథను అనుకున్నట్లు తెరపై తీసుకురావడానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. నా కెరీర్లోనే గుర్తుండి పోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.
ఆర్మీ నేపథ్యంలో కథ..
ఈ కథ ఆర్మీ నేపథ్యం ఉంటుంది. జీవితంలో కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిస్పృహలో ఉన్న ఓ అమ్మాయి ధైర్యాన్ని కూడగట్టుకొని ఆర్మీలోకి ఎలా వెళ్లిందనే పాయింట్ ఆసక్తిగా ఉంటుంది. ‘అమ్మాయిని సింహంలా పెంచాలి’ అనే స్టేట్మెంట్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ సినిమా కోసం ఆర్మీలోకి వెళ్లేందుకు సిద్ధమైన అమ్మాయిల డాక్యుమెంటరీలు చూశాను. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇది. నేటి మహిళలకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. బాలకృష్ణగారు కథను బలంగా నమ్మారు. పెద్ద హీరో అయినప్పటికీ అప్‌కమింగ్ హీరోయిన్ ఫాదర్‌గా నటించడానికి ఒప్పుకున్నారు. నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్.
ఉద్వేగభరితమైన ప్రయాణం
ఈ కథ వరంగల్ నేపథ్యంలో నడుస్తుంది. బాలకృష్ణగారు తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడారు. తెలంగాణ యాసలో ఒక ముక్కుసూటితనం, తెలియని అందం ఉంటుంది. అందుకే సినిమాలో అదే యాసను తీసుకున్నాం. తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పే సంభాషణలతో థియేటర్లు దద్దరిల్లటం ఖాయమని అనుకుంటున్నా. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా రియలిస్ట్‌గా ఉంటాయి. అలాగే నాదైన ఫన్ కనిపిస్తుంది. కథారంభం నుంచి ఓ పాపతో భగవంత్ కేసరి చేసే జర్నీ ఉద్వేగభరితంగా అనిపిస్తుంది. శ్రీలీల కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమవుతుంది. దర్శకుడిగా అన్ని రకాల చిత్రాలు చేయాలనుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉంది. నా తదుపరి సినిమాల వివరాల్ని త్వరలో వెల్లడిస్తా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

