అనిక సురేంద్రన్, అర్జున్దాస్, సూర్య వశిష్టలు నాయకానాయికలుగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. నాగవంశీ ఎస్-సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రానికి ‘బుట్టబొమ్మ’ అనే పేరును ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినాన ఈ చిత్రం ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ సహజంగా సాగుతూ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’ అన్నారు. నవంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ రావూరి, సంగీతం:గోపిసుందర్.