ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్ చిత్రాలకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో 25వ మూవీగా ‘నో టైమ్ టూ డై’ ఇటీవల రిలీజైంది. ఈ మూవీని ఇండియాలో 3డీలో విడుదల చేసి అలరించారు.
తాజాగా హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్ కి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌తో డేనియల్ని సత్కరించింది హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఈయనే. ఇప్పటి వరకు బాండ్ సినిమాల్లో ఐదు సార్లు నటించిన డేనియల్.. నో టైమ్ టూ డై చివరిది అని కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చాడు. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన డేనియల్ తన టీం లేకుంటే ఈ గౌరవం దక్కేది కాదని తెలిపాడు. ఇటీవలే విడుదలైన జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధించింది
జేమ్స్‌బాండ్ ‘నో టైమ్ టూ డై’ చిత్రాన్ని భారీ స్థాయిలో 1600పైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీలో విడుదల చేసారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ చేశారు.