బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్కి సంబంధించిన టాస్క్‌లో వరస్ట్ పర్ఫార్మర్ అనుకున్న వాళ్ల ముఖంపై హౌజ్‌మేట్స్ నీళ్లు జల్లుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాంకర్ రవి.. కాజల్ చెత్త పర్ఫార్మర్ అంటూ నీళ్లు జల్లాడు.ముఖంపై మాటలు మారుస్తూ మాట్లాడడం, పనులు చేయనని రాండ్ స్టేట్మెంట్ ఇవ్వడం నచ్చలేదు. రాజుగా గెలిచిన తర్వాత అందరు జైజై అంటే ఆ సమయంలో నీ పద్దతి నచ్చలేదని రవి అన్నాడు.
నా దగ్గర చేయి ఎత్తితే ఇలాగే ఉంటుంది.. ఎలా ఉండాలో నేర్చుకో అంటూ పద్దతి గురించి రవి కాజల్‌కి క్లాస్ పీకడంతో.. పద్దతుల గురించి నువ్ నాకు చెప్పకు అని కౌంటర్ ఇచ్చింది కాజల్. ఈరోజు నుంచి నువ్ నన్ను ఫ్రెండ్ అని అనొద్దని చెప్పింది కాజల్. కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్న యానీ మాస్టర్ ఆమె మీద కోపంతో తన ముఖం మీద తానే నీళ్లు గుమ్మరించుకుంది. తర్వాత ప్రియాంక సింగ్.. విశ్వ నోరు జారాడంటూ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకుంది.
ఈ టాస్క్ మొత్తంలో కాజల్‌ని ఎక్కువ మంది వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపిక చేయడంతో ఆమెను జైల్లో వేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. కన్నీటితోనే కాజల్ జైలుకి వెళ్లింది. ఇక ఈ రోజు శనివారం కావడంతో నాగార్జున ఒకవైపు సందడి చేస్తూనే మరోవైపు హౌజ్‌మేట్స్‌ని క్లాసులు పీకడం చూడొచ్చు.