Bigg Boss: సిగ్గు, శరం ఉండాలి అంటూ ఫైర్ అయిన అనీ మాస్టర్

గత సీజన్స్ కన్నా ఈ సీజన్లో హౌజ్ మేట్స్ మధ్య కో ఆర్డినేషన్ అనేదే లేకుండా పోయింది. ఒకరిపై ఒకరు చిర్రుబుర్రులు ఆడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం చేస్తున్నారు. కిచెన్‌లో పనుల విషయంలో వచ్చిన బేధాభిప్రాయాల వలన ఎవరి వంట వాళ్లు వండుకుని తినేలా రూల్ పెడతానని జెస్సీని హెచ్చరించాడు శ్రీరామ్. దీంతో జెస్సీ.. రచ్చ చేశాడు. నాకు ఫుడ్ పెట్టరంట, నేనే వండుకోవాలట అంటూ జెస్సీ అన్నాడు.
జెస్సీకి సపోర్ట్‌గా ఉన్న సిరి, షణ్ముఖ్.. శ్రీరామ్‌పై ఫైర్ అయ్యారు. ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్ కెప్టెన్‌వి అంతే! అని సిరి ఫైర్ అయింది. ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్ అని కెప్టెన్‌పై విరుచుకు పడ్డాడు షణ్ముఖ్. మీరు ఏం చేయాలో నాకు చెప్పనవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చాడు శ్రీరామ్.
హౌజ్‌లో జరుగుతున్న గొడవతో చిర్రెత్తిపోయిన యానీ మాస్టర్ సిగ్గు, శరం ఉండాలి అలా గ్రూప్‌ను వేసుకుని రావడానికి అంటూ జెస్సీ మీద ఫైర్ అయినట్లు కనిపించింది. గొడవ వలన డిస్ట్రబ్ అయిన జెస్సీ, షణ్ముఖ్ తినకుండా కూర్చున్నారు. అనీ వారిని తినమని బుజ్జగించిన వినలేదు. ఆకలేస్తే వారే తింటారు వదిలేయండి అని చెప్పిన శ్రీరామ్ .. వాళ్లు తినకపోతే తాను కూడా తిననని శపథం చేశాడు. అనంతరం తానే ప్లేట్లో పెట్టి తీసుకెళ్లాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

