Bigg Boss: పేడ నీళ్లు మీద పోసుకున్న అనీ మాస్టర్.. టీం కోసం చాలా త్యాగాలే చేసింది!

మొన్నటి వరకు జాన్ జిగిరీలలా ఉండే సిరి, షణ్ముఖ్‌ల మధ్య పదే పదే గొడవ అవుతూ వచ్చింది. షణ్ముఖ్ అన్న మాటలకు సిరి బయట వెళ్లి పడుకోగా,ఆమెను కన్విన్స్ చేసి గుంజీలు తీసి అందరి మందు సారీ చెప్పి అలకపోయేలా చేశాడు. అందరి ముందు సారీ చెప్పడంతో.. హగ్ ఇచ్చేసింది సిరి. అర్ధరాత్రి అంతా కూల్ కాగా, మళ్లీ ఉదయాన్నే రచ్చ నడిచింది. ఈ సారి హీరో టీం చాన్స్ రావడంతో వారు.. విలన్ టీం నుంచి ఆనీ మాస్టర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు.
మిక్స్డ్ డ్రింక్స్ ఇచ్చారు.మిరపకాయ తినమని ఇచ్చారు. పెయింట్ పూసుకోమ్మన్నారు. ఐస్ వాటర్ ఒంటి మీద పోసుకోమన్నారు. అందులో కాజల్ పేడ నీళ్లు కలపగా, వాటిని కూడా తన ఒంటిపై పోసుకొని అనీ మాస్టర్ విజేతలగా నిలిచింది. దీంతో విలన్ టీంకి ఒక పాయింట్ దక్కింది. ఇక విలన్ టీంకి చెందిన కంటెస్టెంట్స్ ప్లేట్స్‌తో చప్పుడు చేస్తుండగా, సిరి బట్టలు అన్నీ చిందరవందరగా పడేసింది.
దీనిపై షణ్ముఖ్ ఫైర్ అయ్యాడు. ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని ప్రశ్నించడంతో ఆమె ఇన్నర్స్ సర్దేయడానికి ఒప్పుకుంది. కాకపోతే తన వేళ్లు పని చేయడం లేదని, 2 నిమిషాలు ఆగమని చెప్పింది. అందుకు అంగీకరించని షణ్ను.. ఆ పని ఇప్పుడే చేసి తీరాలని ఆదేశించాడు. దీంతో చిర్రెత్తిపోయిన సిరి చేయనని చెప్పింది. ఇది నీ క్యారెక్టర్ అని షణ్ముఖ్ నోరు జారడంతో సిరి ఎమోషనల్ అయింది. దెబ్బల కన్నా నువ్వనే మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

