Bigg Boss: ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో విలన్ టీం గెలవడంతో ఆ టీం సభ్యులు కెప్టెన్సీ పోటీదారలుగా నిలిచారు. వారి కోసం ‘చిక్కకు దొరకకు’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. విలన్స్ జట్టు సభ్యులు వెల్క్రో జాకెట్ ధరించి మిగిలిన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాలి.
ఈ పోటీ ఆసక్తికరంగా సాగగా, గేమ్ అద్భుతంగా ఆడిన అనీ మాస్టర్ చివర వరకు నిలిచి ఈ వారం కెప్టెన్ అయింది. అయితే ఈ టాస్క్‌లో సిరి,షణ్ముఖ్‌కి మళ్లీ యుద్ధం జరిగింది. కెప్టెన్ షణ్ముఖ్ తనపై బంతులు విసరడాన్ని సిరి జీర్ణించుకోలేకపోయింది. బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ, కూర్చొంది. సర్ది చెప్పేందుకు షణ్ముఖ్ ప్రయత్నించగా, ‘నువ్వు ఫేక్ ఫ్రెండ్‌వి.. నా ముందు నుంచి వెళ్లిపో’అంటూ అతడిపై అరిచింది.
ఫ్యాక్షనిస్ట్ బాంబులు వేసినట్టు వేసాడని సన్నీ అనగా, షణ్ముఖ్ కావాలనే కొట్టాడని రవి కూడా ఆరోపించాడు. ‘నేను ఎవరినీ కావాలని కొట్టలేదు. నా వ్యక్తిగతంగా గేమ్ ఆడా. అలా ఆడకపోతే, గ్రూప్‌గా ఆడుతున్నావ్ అని మీరే అంటారు’ అని షణ్ముఖ్ కౌంటర్ ఇచ్చాడు. షణ్ముఖ్-సిరిల మధ్యకు అస్సలు పోవద్దని, వాళ్లు తిట్టుకుని, ఆ తర్వాత హగ్ చేసుకుంటారని, మధ్యలో మనం బుక్ అవుతామని సన్నీతో రవి చెప్పుకొచ్చాడు. చివరిగా హౌస్‌లో దీపావళి సంబరాలు జరిగాయి. హౌస్మేట్స్ అందరూ ఆట పాటల్లో మునిగి తేలారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

