Gopichandh | వినూత్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటన, అభినయంతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపిచంద్. గతకొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ఈయనకు ‘సీటీమార్’ చిత్రం కాస్త ఊరట నిచ్చింది. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను మెదలు పెట్టింది.
ఈ చిత్రం నుంచి ‘అందాల రాశీ’ అనే మెలోడియస్ సాంగ్‌ను జూన్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపిచంద్‌కు జోడీగా రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.
#PakkaCommercial 2nd Single will be out on 𝐉𝐔𝐍𝐄 𝟏𝐬𝐭!! #AlluAravind @DirectorMaruthi@RaashiiKhanna_ #BunnyVas #KarmChawla@JxBe
@SKNonline @GA2Official @UV_Creations @adityamusicIn theatres #PakkaCommercialOnJuly1st ✨ pic.twitter.com/5b9VLYytQM
— Gopichand (@YoursGopichand) May 26, 2022