Anasuya | కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. వాటా కోరిన సింగర్.. రిప్లై అదిరింది..!
Anasuya | అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. యాంకరింగ్ నుంచి సినిమాల వరకు తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ... ‘జబర్దస్త్’ షోతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
Anasuya | అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. యాంకరింగ్ నుంచి సినిమాల వరకు తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ… ‘జబర్దస్త్’ షోతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ వెబ్ సిరీస్‌లలోనూ బిజీ అవుతోంది. అలాగే అనసూయ మరికొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. నటిగా మాత్రమే కాకుండా యాంకర్, మోడల్, వెబ్ సిరీస్ ఆర్టిస్ట్ ఇలా విభిన్న వేదికల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తోంది.
సినిమాలతో, టీవీ షోస్‌తో బిజీగా ఉంటున్న అనసూయ రెండు చేతులా సంపాదిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. సోమవారం తన ఫ్యామిలీతో కలిసి కొత్తింటిలోకి అడుగుపెట్టగా, ఆ ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అనసూయ ఫ్యామిలీ పిక్స్, ఇంటి పిక్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలోని మరో అధ్యాయం.. శ్రీరామ సంజీవని.. మా కొత్తింటి పేరు.. జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ అనసూయ పోస్ట్ పెట్టింది
అనసూయ షేర్ చేసిన పోస్ట్‌లో.. అనసూయ, సుశాంక్ భరద్వాజ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, నూతన గృహంలోకి అడుగు పెట్టినట్లు కనిపిస్తోంది. అనసూయ కొత్త ఇంటిపై సింగర్, నటి సమీరా భరద్వాజ్ ఫన్నీకామెంట్ చేసింది. అది భరద్వాజ్ ఇల్లే కదా.. అంటే నాకు కూడా వాటా ఉంటుందా? అని సమీరా భరద్వాజ్ కామెంట్ చేయగా, ఈ కామెంట్‌కు అనసూయ రియాక్ట్ అయింది. అవును ఉంది.. అంతా మనదే.. వచ్చేయ్ అని రిప్లై ఇచ్చింది. ఇక అనసూయకి యాంకర్ స్రవంతి విష్ చేయగా, కంగ్రాట్స్ అను, నిక్కు, శౌరు, అయాన్ష్ అని శ్రీముఖి విష్ చేసింది. కంగ్రాట్స్ అనసూయ గారు అని భాను, ఎప్పటి నుంచో వెయిటింగ్ అని రోహిణి కామెంట్లు చేశారు. మొత్తానికి అనసూయ కొత్తింటి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

