Sivangi | నేను ఆ రకంకాదు.. శివంగి విశ్వరూపం
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకుడు. నరేశ్‌బాబు పి. నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది.
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకుడు. నరేశ్‌బాబు పి. నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక క్రైమ్‌ని ప్రెజెంట్ చేస్తూ టీజర్ మొదలైంది.
తన జీవితంలో జరిగిన రెండు ముఖ్య విషయాలు ఆనందిని వెంటాడుతుంటాయి. తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? అనేది చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. ‘వంగేవాళ్లు ఉన్నంతవరకూ మింగే వాళ్లు ఉంటారు. నేను వంగే రకంకాదు.. మింగే రకం.’ అనే బోల్డ్ డైలాగ్ టీజర్లో హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు.
సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: భరణి కె.ధరన్, సంగీతం: ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్, నిర్మాణం: ఫస్ట్‌కాపీ మూవీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

