‘ఆదిపురుష్’ సినిమా నుంచి ప్రభాస్ అభిమానులను సంతోషపెట్టే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయబోతున్నారు. భారీ వేడుకగా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రామాయణ గాథ నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. కృతి సనన్ నాయిక. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.