తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారీ, అభయ్ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కమిట్మెంట్’. ఈ చిత్రాన్ని బల్దేవ్ సింగ్, నీలిమ.టి. నిర్మిస్తున్నారు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. ఈ నెల 19న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత నీలిమ. టి. మాట్లాడుతూ…‘మహిళలు ఇంటా బయట ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మందికి తెలుసు.
సినీ పరిశ్రమలో వారు పడుతున్న ఇబ్బందులు ఏమిటి అనేది కథా నేపథ్యంగా ఈచిత్రాన్ని నిర్మించాం. ఆ సమస్యల్ని అధిగమించి అనుకున్న లక్ష్యాలకు ఎలా చేరుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. సమస్యలే కాదు పరిష్కారాలూ సూచించాం.’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అమిత్ తివారీ, కెవ్వు కార్తీక్, హీరోయిన్ తనిష్క్ రాజన్ తదితర చిత్ర బృందం పాల్గొన్నారు.