బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థం, నుపుర్ శిఖరేతో ముంబైలో జరిగింది. ఈ వేడుకకు అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్ హాజరైంది. పార్టీలో అమీర్ ఖాన్ తాను1998లో నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలోని పపా కహెతే హై పాటకు హుషారుగా డాన్స్ చేశాడు. ఐరా ఖాన్‌తో పాటు అక్కడి వాళ్లంతా అమీర్‌ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐరా, నుపుర్ గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీళ్ల ప్రేమకు ఇరుకుటుంబాలు అంగీకరించడంతో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో శుక్రవారం ముంబైలో ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఇమ్రాన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, కిరణ్ రావు హాజరయ్యారు.
అమీర్ ఖాన్ ఈమధ్యే లాల్ సింగ్ చద్ధా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ప్లాప్ కావడంతో తాను సినిమాల నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఏడాది లేదా రెండేళ్లు సినిమాలు చేయనని, కుటుంబంతో గడపాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అమీర్ ఖాన్ తెలిపాడు.