ఆ విషయాన్ని ఖచ్చితంగా పాటిస్తాను
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు కళ్యాణ్‌రామ్. గత ఏడాది ‘బింబిసార’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా ‘అమిగోస్'పేరుతో మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు కళ్యాణ్‌రామ్. గత ఏడాది ‘బింబిసార’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా ‘అమిగోస్’పేరుతో మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్‌రామ్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
‘బింబిసార’ సక్సెస్‌ను ఎలా ఆస్వాదించారు?
ఆ సక్సెస్ జోష్‌లోనే ‘అమిగోస్’లో నటించాను. సినిమా విజయం సాధిస్తే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ ఈ మూడు కథలు 2020లో అంగీకరించినవే.
‘అమిగోస్’ కథ వినగానే మీకు నచ్చిన అంశం ఏమిటి?
కథ వినగానే కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చేశాను. మామూలుగా ట్రిపుల్ రోల్ అంటే కనీసం ఇద్దరు హీరోయిన్లైనా వుంటారు. కానీ ‘అమిగోస్’ పూర్తి భిన్నమైన సినిమా. ఇందులో ఒక్క హీరోయిన్ మాత్రమే వుంటుంది. ఒకే పోలికలతో వుండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? ఎందుకు కలిశారు? అనేది ఆసక్తికరంగా వుంటుంది.
ఇది కమర్షియల్ సినిమానా? లేక ప్రయోగాత్మక సినిమానా?
కొత్త పాయింట్‌తో అల్లుకున్న పూర్తి కమర్షియల్ సినిమా ఇది. నేను నటించిన సినిమాల్లో కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వున్నాయి.
‘బింబిసార’ లాంటి బిగ్ కమర్షియల్ సక్సెస్ తరువాత మీ కథల ఎంపికలో మార్పు వచ్చిందా?
అలాంటిదేమీ లేదు. ‘బింబిసార’కు ముందు కథల ఎంపిక విషయంలో ఎలా వున్నానో తరువాత కూడా అలాగే వున్నాను. ఏ సినిమా అంగీకరించినా.. ఆ పాత్ర నా కెరీర్లో ఇంతకు ముందు చెయ్యనిదై వుండాలనుకుంటా. ఈ విషయాన్ని ఖచ్చితంగా పాటిస్తాను.
ఈ చిత్రంలో బాలకృష్ణ సినిమాలోని సాంగ్‌ను రీమిక్స్ చేశారు
ఈ సినిమా సెకండాఫ్‌లో కథ ఆసక్తిగా సాగుతున్నప్పుడు పాట వస్తే ప్రేక్షకులు నిరాశపడతారు. అలా జరగకుండా వుండాలంటే రెగ్యులర్ పాట కాకుండా ఏదైనా కొత్తగా వుండాలని అనుకున్నాం. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ రీమిక్స్ పాట. ఈ పాట చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చింది.
ఒకే పోలికలతో వుండే మనుషులను మీరు ఎప్పుడైనా చూశారా?
మనుషులను పోలిన మనుషులు వుంటారని అందరూ అంటుంటారు. అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం. నాకు వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ తారసపడలేదు.
మీ తదుపరి చిత్రాలు ఏమిటి?
‘డెవిల్’ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ‘బింబిసార-2’ ఈ ఏడాది చివరలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం వుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

