Ambajipeta Marriage Band | ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
Ambajipeta Marriage Band | ‘కలర్ ఫోటో’ (Colour Photo) ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) ఒకటి. దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Ambajipeta Marriage Band | ‘కలర్ ఫోటో’ (Colour Photo) ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) ఒకటి. దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్. ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు.
ఈ మూవీ నుంచి మా ఊరు అంబాజీపేట సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. రారోయ్ మావురి సిత్రాన్ని సూద్దాం. ఇటు రారోయ్ ఈ బతుకు పాటను విందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులేన్నో ఉన్నాయి. ఈ డప్పుల చప్పుడులోనా ఊగించే గుండె లయాలు ఉన్నాయి అంటూ ప్రోమో సాగింది. ఇక మ్యూజిక్ బ్యాండ్లను నమ్ముకుని బతుకుతున్న కార్మికుల ఇతివృత్తంతో ఈ పాట ఎమోషనల్‌గా సాగింది. ఈ సాంగ్‌ను కాలభైరవ పాడగా.. రెహమాన్ లిరిక్స్, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఫుల్ సాంగ్‌ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 02న విడుదల చేయనున్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

